స్పీకర్ మాకు నీతులు చెప్పొద్దు: నాగం జనార్ధన్ రెడ్డి

nagam janardhan reddy
హైదరాబాద్: శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ రాజీనామాలపై తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, నాగర్ కర్నూల్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి గురువారం అన్నారు. రాజీనామాపై నియమ నిబంధనలకు స్పష్టంగా ఉన్నాయన్నారు. తాము స్పీకర్ ఫార్మాట్‌లోనే నిబంధనకు అనుగుణంగా రాజీనామా చేశామన్నారు. తమ రాజీనామాలు వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. రాజీనామాలు ప్రతి ఒక్కరి హక్కన్నారు. మా హక్కులను కాలరాసే హక్కు స్పీకర్‌కు గానీ మరెవరికీ గాని లేదన్నారు. రాజీనామాలు ఆమోదించుకునే వరకు తాము తగ్గేది లేదన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. తప్పుడు కేసులతో ఉద్యమాన్ని అణచలేరన్నారు. ఉద్యోగులపై, నేతలపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులతో ఉద్యమం మరింత ఉధృతంగా మారుతుందన్నారు. ముఖ్యమంత్రి అగ్గితో తలగోక్కుంటున్నారన్నారు. తెలంగాణ మంత్రులు సకల జనుల సమ్మెలో భాగంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనాలన్నారు. లేదంటే మా తడాఖా చూపిస్తామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+