వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాళ్లారిలోని గాలి జనార్దన్ రెడ్డి గనుల్లో సిబిఐ బృందం

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
బళ్లారి/ న్యూఢిల్లీ: బళ్లారిలోని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గనులను సిబిఐ అధికారులు శుక్రవారం పరిశీలించారు. బళ్లారి జిల్లాలోని గాలి సోదరులకు చెందిన అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ (ఏఎంసీ), డెక్కన్ మైనింగ్ సిండికేట్ (డీఎంఎస్) గనుల్లోనూ, రామ్‌ఘడ్ అటవీ ప్రాంతాల్లో సీబీఐ బృందం పర్యటించింది. కాగా, డెక్కన్ మైనింగ్ సిండికేట్ సహా మూడు గనుల కంపెనీలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో నివేదిక ఇవ్వాల్సిందిగా శుక్రవారం సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులు, సండూరు వద్ద ఉన్న గనుల ప్రాంతాల్లో పర్యటించింది. మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది.

ఇకముందు కూడా గనులను సందర్శిస్తామని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. డీఎంఎస్, రామ్‌ఘడ్ అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీల రికార్డులను పరిశీలించామని వెల్లడించారు. ముఖ్యంగా ముడిఖనిజం ఎగుమతులు, దిగుమతులకు చెందిన పత్రాలపై దృష్టి సారించామని తెలిపారు. మైనింగ్ నిపుణులు, రికార్డు సెక్షన్‌కు చెందిన వారినీ ప్రశ్నిస్తామని చెప్పారు. గతంలో సీబీఐ అందజేసిన నివేదికను సుప్రీం పర్యావరణ ధర్మాసనం శుక్రవారం పరిగణనలోకి తీసుకుంది. ఓఎంసీ, దక్కన్ మైనింగ్ కార్పొరేషన్‌లకు సంబంధించిన బాధ్యుల వివరాలను సమర్పించాలని శుక్రవారం విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కపాడియా, న్యాయమూర్తులు జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఇక బళ్లారి మైనింగ్ కార్పొరేషన్ యాజమాన్యానికి సంబంధించి స మాచారంతో మరొక నివేదికను ఇవ్వాలని సూచించింది.

English summary
CBI team visited Karnataka ex minister Gali Janardhan Reddy's mines Bellary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X