పరారీలో కెసిఆర్, కోదండరాం: కోర్టులో చార్జీషీట్?

వారంతా ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. 143, 188, 506, 147, 157 తదితర సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. కాగా మరోవైపు తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డిలను పోలీసులు కరీంనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. స్టేషన్ ఘన్‌పూర్ శాసనసభ్యుడు రాజయ్యకు కోర్టు ఏడు రోజుల రిమాండ్ విధించింది. ఆయనను సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో కారేపల్లి మండలం న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో తెలంగాణవాదులు రైలు పట్టాలపై బైఠాయించడంతో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications