చెప్పినా వినలేదు: అరెస్టైన ఎంపీలపై సిఎం కిరణ్

kiran kumar reddy
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రైలు రోకోలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ముందే హెచ్చరించినప్పటికీ వారు వినిపించుకోలేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం తెలంగాణ ప్రాంత మంత్రులతో అన్నట్లుగా సమాచారం. రైలు రోకో చేస్తే రైల్వే చట్టం ప్రకారం కేసులు ఉంటాయని అలా కాకుండా గృహ నిర్బంధం చేస్తామని ముందుగానే ప్రజాప్రతినిధులకు చెప్పినా వారు వినలేదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. క్యాంపు కార్యాలయంలో మంత్రులు కే జానారెడ్డి, గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, డీకే ఆరుణ, బస్వరాజు సారయ్య, సుదర్శన్‌రెడ్డి తదితరులతో ముఖ్యమంత్రితో శనివారం భేటీ అయ్యారు. సకల జనుల సమ్మె, రైలు రోకోల్లో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నాన్ బెయిలబుల్ కేసుల నమోదుపై జానారెడ్డి ప్రస్తావించారు. ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్‌లపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయని, వివేక్ కుమార్తె వివాహం ఉన్నందున ఆయనపై కేసులు ఎత్తివేయాలని కోరారు.

తెలంగాణ వ్యాప్తంగా రెండు వేలకు పైగా కేసులు నమోదు కాగా, ఒక్కరిపైనే కేసులు ఎత్తివేయడం సరికాదని సీఎం వివరించారు. రైలు రోకోకు వెళుతున్న ఎంపీలను మార్గంలోనే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ప్రజాప్రతినిధులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కాకుండా చూడాల్సిందని, ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రిని నిలదీశారట. వారిని ఇంటి వద్దే అరెస్టు చేస్తామని పోలీసు అధికారుల ద్వారా సమాచారం పంపామని కానీ, పోలీసులు వెళ్లేందుకు ముందే రైలు రోకోకు వారు వెళ్లిపోతే తానేమీ చేయగలనని సిఎం సమాధానమిచ్చారట. నిజానికి ఎవరెవరిపై ఏయే కేసులు నమోదు అయ్యాయో తనకు పూర్తి వివరాలు తెలియదని, అయితే ఎంపీ పొన్నంపై ఆందోళన కేసుతో పాటు పోలీసు స్టేషన్ నుంచి తప్పించుకున్న కేసు నమోదయ్యాయని సీఎం వివరించారు. బెయిల్‌కు పొన్నం నిరాకరించడంతో రిమాండ్ పడిందని తెలిపారు. కాగా, అనంతరం ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వెళ్లిన సమయంలో క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఎంపీలు కే కేశవరావు, మధుయాష్కీ గౌడ్‌లు అక్కడే బైఠాయించారు.

ఈ విషయం తెలుసుకున్న సీఎం హుటాహుటిన తిరిగి వచ్చారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని కేశవరావు ఆగ్రహంతో ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. గతంలో ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో సీఎంకు జరిగిన వాగ్వివాదాన్ని దృష్టిలో పెట్టుకొని కక్షతోనే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. రైల్వే ఆస్తులకు నష్టం జరగనందున ప్రజాప్రతినిధులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి తెలిపారని కేకే అన్నారు. పొన్నంపై కక్షతోనే సీఎం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయించారని మీడియా వద్ద కేకే విమర్శించారు. ఆదివారం పొన్నం ప్రభాకర్‌కు బెయిల్ తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి తనకు పంపిన ఎస్ఎంఎస్‌ను మీడియాకు చూపారు. ప్రజా ప్రతినిధులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కేశవరావు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+