రాత్రంతా తిప్పుతారా: రాములమ్మ అరెస్టుపై కోదండరాం

రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. ఇక నుండి మంత్రులపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. సాయంత్రం ఐకాస సమావేశం జరుగుతుందని అందులో చలో హైదరాబాదుపై చర్చిస్తామని చెప్పారు. మంత్రి జానారెడ్డి సమ్మెను విరమించుకోవాలని కోరటం సరికాదన్నారు. తన వ్యాఖ్యలపై ఆయన వెంటనే సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. సమ్మె విరమించాలని చెప్పటం తెలంగాణకు ద్రోహం చేసినట్లేనన్నారు. ఓ మహిళ హోంమంత్రిగా ఉన్నప్పటికీ మహిళలను రాత్రంతా జైలులో ఉంచడం శోచనీయమన్నారు.
తెలంగాణ వచ్చే వరకు సకల జనుల సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీలో తెలంగాణ నాయకత్వం ఎదగాల్సి ఉందన్నారు. అందుకే ఆర్టీసి సమ్మె వాయిదా వేసుకున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications