బాబుపై విజయమ్మ పిల్‌లో ప్రతివాదిగా భువనేశ్వరి

దేశవిదేశాల్లో చంద్రబాబు పేర ఆస్తుల వివరాలను, బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను ఆమె తన పిటిషన్‌లో చేర్చారు. తల్లి పేరుతో కూడా చంద్రబాబు అక్రమాలకు పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. సింగపూర్‌లో బినామీ పేరు మీద చంద్రబాబు హోటల్‌ను కొనుగోలు చేశారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు బినామీలుగా సుజనా చౌదరి, సిఎం రమేష్ వ్యవహరిస్తున్నారని, వారి పేరు మీద చంద్రబాబు నిధులను విదేశాల నుంచి తరలించారని ఆమె అన్నారు. నెల్లూరు జిల్లా బాలాయిపల్లిలో చంద్రబాబుకు చెందిన వ్యవసాయ భూముల వివరాలను ఆమె అందులో పొందుపరిచారు.












Click it and Unblock the Notifications