తెలంగాణ మంత్రులను కట్టడి చేసిన హైకమాండ్

అయినప్పటికీ తెలంగాణ మంత్రుల తీరు పట్ల కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు స్టీరింగ్ కమిటీ సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. తాను సమావేశానికి వెళ్లకపోతే తనపై దాడి తీవ్రంగా ఉంటుందని గ్రహించి, దాన్ని తిప్పికొట్టడానికి మాత్రమే జానా రెడ్డి సమావేశానికి హాజరై, ముందుకు కేశవరావుతో మంతనాలు జరిపినట్లు చెబుతున్నారు. మంత్రులు రాజీనామా చేయాలని పార్లమెంటు సభ్యులన్నప్పుడు తెలంగాణ ఇస్తామంటే ఇప్పటికిప్పుడు తాను రాజీనామా చేస్తానని జానా రెడ్డి ఎదురుదాడికి దిగినట్లు చెబుతున్నారు. అయితే, జానా రెడ్డి కొంత ఆత్మరక్షణలో కూడా పడినట్లు కనిపిస్తున్నారు. మంగళవారం సాయంత్రం, బుధవారం మధ్యాహ్నం మాట్లాడిన తీరు ఆ విషయాన్ని తెలియజేస్తోంది.












Click it and Unblock the Notifications