జానారెడ్డి ఇంటి నిండా కార్లు, కోట్ల రూపాయలు: గోనె

Gone Prakash Rao
హైదరాబాద్: ఇంటి కాంపౌండ్ నిండా కార్లు, వేలాది కోట్ల రూపాయలు కలిగి ఉన్న మంత్రి జానారెడ్డి తెలంగాణ కోసం త్యాగాలు చేశానని చెప్పడం విడ్డూరంగా ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గోనె ప్రకాశ్ రావు బుధవారం విమర్శించారు. పదహారేళ్లు ఆయన మంత్రిగా ఉండి నల్లగొండ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జానారెడ్డి తెలంగాణ సెంటిమెంటు అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన అంశాన్ని రాజకీయ అవకాశవాదాలకు ఉపయోగించడం చాలా బాధాకరమన్నారు. అది సరి కాదన్నారు.

తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు రాజీనామా చేస్తేనే తెలంగాణ వస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ యుపిఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లు ప్రవేశ పెడితే తాము మద్దతిస్తామని చెప్పడం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడమే అన్నారు. కాగా జానారెడ్డిపై సొంత పార్టీ నేతలు కూడా ఇటీవల విమర్శలు చేయడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+