తెలంగాణ కోసం త్వరలో కెసిఆర్ ఆమరణ నిరశన దీక్ష

K Chandrasekhar Rao
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు త్వరలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు బుధవారంనాడు నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ప్రకటించారు. ఎలాంటి పరిస్థితిలో దీక్ష చేయాలనేది ఇంకా నిర్ణయం కాలేదని ఆయన అన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు కెసిఆర్ దీక్షకు వెనకాడబోరని ఆయన అన్నారు. తెలంగాణ సకల జనుల సమ్మెతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక వచ్చిందని ఆయన అన్నారు.

తెలంగాణ మంత్రులు పదవులు వీడితేనే తెలంగాణ వస్తుందని మాజీ మంత్రి, కాంగ్రసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆర్టీసి కార్మికులను చూసైనా తెలంగాణ మంత్రులు బుద్ధి తెచ్చుకోవాలని ఆయన అన్నారు. సీమాంధ్రులను ఎదిరించి ఆర్టీసి కార్మికులు సమ్మెకు దిగారని, తెలంగాణ మంత్రులు కూడా సీమాంధ్ర పాలకులను ఎదిరించాలని ఆయన అన్నారు. 18 ఏళ్లుగా మంత్రి పదవిలో ఉన్న ఓ రాజకీయనాయకుడు తెలంగాణ కోసం రాజీనామా చేయడానికి వెనకాడుతున్నారని ఆయన విమర్శించారు. ఆర్టీసి కార్మికుల ప్రదర్శించిన ఐక్యత తెలంగాణ మంత్రులు ప్రదర్శించి ఉంటే తెలంగాణ ఎప్పుడో వచ్చేదని ఆయన అన్నారు. తెలంగాణ నేతల మధ్య విభేదాలు సృష్టించాలని కుట్రలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+