జానారెడ్డికి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి బుజ్జగింపు

K Jana Reddy-Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానా రెడ్డిని బుజ్జగించే పనిలో పడినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం జరిగిన కాంగ్రెసు స్టీరింగ్ కమిటీ సమావేశంలో సహచరులంతా జనారెడ్డిని లక్ష్యం చేసుకుని విమర్సలు చేశారు. ఈ నేపథ్యంలో తీవ్రంగా కలత చెందిన జానా రెడ్డి రాజీనామాకు సిద్ధపడడమే కాకుండా సహచర తెలంగాణ మంత్రులతో చర్చలు జరిపేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జానా రెడ్డిని చర్చలకు ఆహ్వానించారు. దీంతో జానారెడ్డి బుధవారం ఉదయం ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.

రాజీనామాలు చేసే విషయంలో తొందర పడవద్దని, ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు కాబట్టి రాజీనామాలుచేస్తే ఇబ్బందుల ఎదురవుతాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జానా రెడ్డితో చెప్పినట్లు సమాచారం. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని, అందుకు కాస్తా సమయం కావాలని, అప్పటి వరకు ఓపిక పట్టాలని కిరణ్ కుమార్ రెడ్డి జానారెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు తెలంగాణ స్టీరింగ్ కమిటీ సమావేశం తర్వాత పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా జానారెడ్డితో మాట్లాడారు. రాజీనామాలు చేసే విషయంలో తొందరపడవద్దని ఆయన జానారెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+