తెలంగాణ, సీమంధ్ర ప్రజల మధ్య సద్భావన: డిఎస్

D Srinivas
హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య సద్భావన రావాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. హైదరాబాదులోని చార్మినార్ వద్ద బుధవారం ఏర్పాటైన రాజీవ్ సద్భావనా సభలో ఆయన ప్రసంగించారు. ప్రజల మధ్య విద్వేషాలు పెంచడం మంచిది కాదని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు నాయకుల్లో ఐక్యత రావాలని, అందుకు సమన్వయంతో వ్యవహరించాలని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రజల ఆకాంక్ష మరింతగా పెరుగుతోందని, రాష్ట్ర ఏర్పాటు కాంక్షతో తెలంగాణవాదం బయలుదేరిందని ఆయన అన్నారు.

తెలంగాణ సమస్యపై పరస్పర దూషణలు సరి కాదని ఆయన అన్నారు. అభిప్రాయ భేదాలుంటే చర్చించుకోవాలి గానీ పరస్పర విమర్శలు పార్టీలో మంచివి కావని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యపై కేంద్రాన్ని ఇబ్బంది పెట్టకూడదని ఆయన పార్టీ నేతలకు సూచించారు. అంతకు ముందు తెలంగాణ న్యాయవాదులు రాజీవ్ సద్భావన సభను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. చార్మినార్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు తెలంగాణ న్యాయవాదులను అరెస్టు చేశారు. దాంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+