అద్వానీపై సమైక్యవాదుల ధ్వజం, దిష్టిబొమ్మ దగ్ధం

అద్వానీ రథయాత్ర అవినీతిపై చేసినట్లుగా లేదని తెలంగాణ కోసం చేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణపై సానుకూల సంకేతాలు కేంద్రం నుండి వస్తున్నాయన్న తెలంగాణ కాంగ్రెసు నేతల ప్రకటనను ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొట్టి పారేశారు. సంకేతాలు వారి సొంత అభిప్రాయమే అన్నారు. కేంద్రం అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం ప్రకటిస్తుందన్నారు. శ్రీకాళహస్తిలో పూజలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
విశాఖపట్నంలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి కార్యకర్తలు అద్వాని దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణపై అద్వాని తీరు సరిగా లేదన్నారు. ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్రకు తెలంగాణ అవసరం లేదంటూ లేఖ రాశారని ఇప్పుడు మాత్రం తెలంగాణ అంటూ రాగం అందుకున్నారని విమర్శఇంచారు.












Click it and Unblock the Notifications