వాళ్లిద్దరు అనుకుంటే తెలంగాణ వస్తుంది: అద్వానీ

LK Advani
హైదరాబాద్: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తలుచుకుంటే 2012 జనవరి 1వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోవడానికి కారణమేదీ లేదని ఆయన అన్నారు. హైదరాబాదులోని ఎగ్జిబిషన్ మైదానంలో బుధవారం రాత్రి జరిగిన జనచేతన బహిరంగ సభలో ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే తాము పూర్తి మద్దతిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభ తీర్మానం అవసరం లేదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్టాన్ని ఏర్పాటు చేయవచ్చునని ఆయన అన్నారు. పార్లమెంటు సాధారణ మెజారిటీతో రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేది తామేనని ఆయన అన్నారు.

యుపిఎ ప్రభుత్వంలోని కుంభకోణాలపై సినిమా తీయవచ్చునని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. యుపిఎ ప్రభుత్వంలోని కుంభకోణాలతో ప్రజలు విసిగిపోయారని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయం అయిపోయిందని ఆయన అన్నారు. నల్లధనం వెలికితీతలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. యుపిఎ ప్రభుత్వ పతనం ఖాయమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి తనకు విశేమైన ఆదరణ లభించిందని ఆయన అన్నారు. ప్రస్తుతం లభించిన ఆదరణ మునుపెన్నడూ లభించలేదని ఆయన అన్నారు. ప్రస్తుత యాత్ర గత యాత్రలకన్నా భిన్నమైందని ఆయన అన్నారు. పార్లమెంటు సమావేశాలకు ముందే తన యాత్ర ముగుస్తుందని ఆయన చెప్పారు.

తెలంగాణలో అద్వానీ జనచేతన యాత్రకు విశేషమైన ఆదరణ లభించింది. ఆయన బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ సాగించిన యాత్రలో ప్రతిచోటా తెలంగాణ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండును నెరవేర్చకపోవడంపై కాంగ్రెసుపై విమర్శలు చేశారు. ప్రసంగం చివరలో జైజై తెలంగాణ నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+