బాబుకు మొహం చాటేస్తున్న తెలంగాణ టిడిపి నేతలు

Chandrababu Naidu
హైదరాబాద్: బాన్సువాడ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మొహం చాటేస్తున్నట్లుగా కనిపిస్తోంది. వారి ఉప ఎన్నికల ఫలితాల అంచనా తారుమారు కావడమే బాబును కలవక పోవడానికి కారణమని సమాచారం. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో బాన్సువాడలో తెదేపా తరఫున అభ్యర్థిని నిలపవద్దని చంద్రబాబును టిటిడిపి నేతలు పోటీకి ముందు విజ్ఞప్తి చేశారు. పోటీ చేయాలనే ఆలోచన బాబుకు ఉన్నప్పటికీ వారి సలహా మేరకు ఆయన అంతిమ నిర్ణయం మీరే తీసుకోవాలని వారికి సూచించారు. పోటీలు నిలపాలా వద్దా అనే బాధ్యతను వారి పైకి నెట్టడంతో తీవ్ర తర్జన భర్జనల అనంతరం వారు పోటీ చేయక పోవడమే ఉత్తమమని భావించి వెనక్కి తగ్గారు. 2010 ఉప ఎన్నికల మాదిరి డిపాజిట్ కూడా దక్కక పోవచ్చుననే భావనతో టిటిడిపి ఫోరం నేతలు పార్టీ తరఫున అభ్యర్థిని దింపక పోవడమే మంచిదని భావించారు.

ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో పోటీకి దిగితే తెలంగాణ ప్రజల్లో వ్యతిరేక సంకేతాలు వస్తాయని కూడా భావించారు. అదే సమయంలో కాంగ్రెసు మాత్రం పార్టీ క్యాడర్ కాపాడుకోవడానికి రంగంలోకి దిగింది. కాంగ్రెసు అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కదని అందరూ భావించారు. కానీ అనూహ్యం అతను 33వేల పైచిలుకు ఓట్లు సాధించారు. దీంతో టిటిడిపి ఖంగు తిన్నది. పోటీలో ఉంటే డిపాజిట్ కూడా దక్కదనుకుంటే కాంగ్రెసుకు భారీ ఓట్లు రావడం వారిని పునరాలోచనలో పడేసింది. బాబు నిర్ణయం ప్రకారం పోటీకి దిగితే కనీసం క్యాడర్‌ను కాపాడుకునే వారమనే భావన వారిలో కలిగినట్లుగా కనిపిస్తోంది. ఉద్యమ ఉధృతంగా ఉన్న సమయంలో లక్ష మెజార్టీతో గెలుస్తాడని భావించిన తెరాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి కేవలం యాభై వేల మెజార్టీతో గెలుపొందటంతో బాబుకు ఏం సమాధానం చెప్పాలో తెలియక వారు మొహం చాటేస్తున్నట్లు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+