కలత చెంది జైలుకే వెళ్తానంటున్న యడ్యూరప్ప

ఛాతీ నొప్పి వస్తుందని చెప్పడంతో ఆదివారం ఉదయం యడ్యూరప్పను ప్రభుత్వ ఆధ్వర్యంలోని జయదేవ కార్జియాలజీ ఇనిస్టిట్యూట్‌లో చేర్చారు. యడ్యూరప్ప గుండె సజావుగానే పనిచేస్తోందని ఇనిస్టిట్యూట్ తేల్చి చెప్పింది. దీంతో ఆయనను ప్రభుత్వ ఆధ్వర్యంలోని విక్టోరియా ఆస్పత్రికి మార్చారు. తద్వారా జైలుకు వెళ్లడాన్ని యడ్యూరప్ప వాయిదా వేస్తూ వస్తున్నారనే విమర్శలు కూడా చుట్టుముట్టాయి. ఈ మేరకు టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి. దీంతో కలత చెందిన యడ్యూరప్ప తాను జైలుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి సోమన్న చెప్పారు. తనను మోసగాడిగా చూస్తున్నారని యడ్యూరప్ప ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు.












Click it and Unblock the Notifications