అద్వానీ తండ్రిలాంటివారు, బిజెపిలో చేరను: విజయశాంతి

తాను బిజెపిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణపై కేంద్రం మీద మరింత ఒత్తిడి తేవాలని తాను అద్వానీని కోరినట్లు ఆమె తెలిపారు. తెలంగాణ ఇచ్చేది బిజెపి, తెచ్చేది తెరాస, చచ్చేది కాంగ్రెసు పార్టీ అని ఆమె వ్యాఖ్యానించారు. అన్ని రాజకీయ పక్షాలు కలిసి తెలంగాణపై కేంద్రం మీద ఒత్తిడి తేవాలని ఆమె సూచించారు. తనకు, తమ పార్టీ అధినేత కె చంద్రశేఖర రావుకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆమె చెప్పారు. విభేదాలు ఉన్నట్లు ఎవరో ప్రచారం చేస్తే తాము స్పందించబోమని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications