తెలంగాణపై క్షమాపణ చెప్పండి: అద్వానికి బొత్స

Botsa Satyanarayana
హైదరాబాద్: తెలంగాణ అంశంపై భారతీయ జనతా పార్టీ ద్వంద విధానాలతో వెళుతోందని అందుకు వెంటనే రాష్ట్ర ప్రజలకు ప్రధానంగా తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ అగ్రనేత ఎల్ కె అద్వానీ క్షమాపణలు చెప్పాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గురువారం డిమాండ్ చేశారు. 1997లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వక పోవడం నెపాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైకి నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణపై ప్రజలను మభ్యపెట్టే వ్యాఖ్యలు మానుకోవాలని కోరారు. తెలంగాణపై ఇరు ప్రాంతాలకు సమ న్యాయం చేయడం కోసం కేంద్రం ప్రయత్నిస్తోందని త్వరలో పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారు.

అవినీతిపై అద్వాని వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. అవినీతి ఎక్కడున్నా కాంగ్రెసు సహించదన్నారు. అందుకే తాము అవినీతికి పాల్పడిన నేతలను జైలుకు పంపించామన్నారు. కర్నాటకలో అవినీతికి పాల్పడ్డ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అవినీతిలో బిజెపి ముందంజలో ఉందన్నారు. కుంభకోణాలు, అవినీతికు బిజెపియే ఆదర్శమన్నారు. ఎన్డీయే ప్రభుత్వం హయాంలో రైతులకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అవినీతి రూపుమాపడానికి కాంగ్రెసు చిత్తశఉద్ధితో ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+