వైయస్ జగన్ ఇంటి విలువ లెక్కిస్తున్నాం: సిబిఐ ఎస్పీ

కాగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి గురువారం సిబిఐ అధికారులు వెళ్లారు. హైదరాబాదులోని లోటస్ పాండులో ఉన్న ఆయన ఇంటికి సిబిఐ అధికారులతో పాటు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ(ఎన్ఆర్ఎస్ఏ), ఐటి అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు చేరుకున్నారు. ఎన్ఆర్ఎస్ఏ సహకారంతో జగన్ ఇంటి నిర్మాణాన్ని, దాని ఖర్చును అంచనా వేశారు. ఈ అంశంపై నగర ప్రణాళికా అధికారులను విచారించనున్నారని సమాచారం. అలాగే ఇంటి నిర్మాణం నియమ నిబంధనలకు అనుగుణంగానే ఉందా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications