అక్రమాస్తుల కేసు విచారణ : బెంగళూరుకు జయలలిత

Jayalalitha
బెంగళూరు/చెన్నై: ప్రతిష్టాత్మక మెట్రో రైలు ప్రారంభోత్సవం రోజు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురువారం ఉదయం చెన్నై నుంచి బెంగళూరు బయల్దేరారు. అక్రమ ఆస్తుల కేసులో విచారణ నిమిత్తం ఆమె గురువారం బెంగళూరు కోర్టుకు హాజరు కానున్నారు. ఆమె రాక నేపథ్యంలో బెంగళూరులో 144వ సెక్షన్ విధించారు. హోసూరు రోడ్డు సమీపంలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన అవినీతి నిరోధక ప్రత్యేక న్యాయస్థానంలో కేసు విచారణ జరగనుంది. జయలలిత రాక నేపథ్యంలో బెంగళూరు, తమిళనాడు పోలీసులు భారీ ఎత్తున కటుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

కాగా భద్రతా కారణాల దృష్ట్యా వ్యక్తిగతంగా కోర్టు హాజరయ్యే విషయంలో తనకు మినహాయింపు ఇవ్వాలని కోర్టును జయలలిత కోరిన విషయం తెలిసిందే. దానిని కోర్టు తోసి పుచ్చింది. వ్యక్తిగత మినహాయింపు ఇచ్చేది లేదని అవసరమైనంత భద్రతతో కోర్టుకు రావాలని జయను ఆదేశించింది. దీంతో తప్పని సరిగా ఆమె బెంగళూరు ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్నారు.

జయలలిత సుమారు గం.10 సమయంలో హాల్ ఎయిర్ పోర్టుకు రానున్నారు. అక్కడి నుండి బులెట్ ప్రూఫ్ కారులో నేరుగా కోర్టుకు వెళతారు. ఇద్దరు ఆర్మ్‌డ్ పోలీసు అధికారులు ఆమె వెంట అదే కారులో వెళతారు. ఈమె కాన్వాయ్‌లో నలుగురు ఆర్మ్‌డ్ పోలీసు అధికారులతో కూడిన రెండు ఎస్కార్టు వాహనాలు ఉంటాయి. ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న ఆమెకు గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+