తెలంగాణలో కెసిఆర్, కోదండరాం దిష్టిబొమ్మ దగ్ధం

KCR and Kodandaram
వరంగల్/హైదరాబాద్: ఢిల్లీ వెళ్లి కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలతో ఏం చర్చించారో బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి ఫోరం గురువారం వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం దిష్టి బొమ్మలను దహనం చేసింది. తెలంగాణ ప్రజలను మోసం చేసే చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. కెసిఆర్, కోదండరాంలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు పట్టణంలోని అమరవీరుల స్థూపం వరకు ర్యాలీగా వెళ్లారు.

కాగా హైదరాబాదులో నేషనల్ మజ్దూర్ యూనియన్ స్టీరింగ్ కమిటీ సమావేశమయింది. ఈ సందర్భంగా ఎన్ఎంయు నేత మహమూద్ మాట్లాడారు. తాను తెలంగాణ వాదినేనని నేనూ ఈ గడ్డపైనే పుట్టానని తనను ఉద్దేశ్య పూర్వకంగా సీమాంధ్రుడిగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదవుల కోసం సెంటిమెంటు వాడుకున్నది అశ్వత్థామ, థామస్ రెడ్డిలేనన్నారు. వారే అసలు ద్రోహులని ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+