తెలంగాణ నేతలది ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర: రాయపాటి

భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ గుర్తుకు రాలేదా అని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు నై అన్న అద్వానీ ఇప్పుడు సై అనడం ఏమిటని ప్రశ్నించారు. కేవలం ఓట్ల కోసమే బిజెపి తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక తెలంగాణ ఇస్తామని చెబుతున్నారన్నారు. బిజెపి వైఖరి ఇలాగే ఉంటే తెలంగాణలో ఒకటి రెండు సీట్లు వచ్చినా ఆంధ్రలో జీరో అన్నారు. ప్రభుత్వాన్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా శాంతియుతంగా సమైక్యాంధ్ర కోసం ఉద్యమించాలని సమైక్యాంధ్ర జెఏసిని ఆయన కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications