ఎమ్మార్ కేసులో బొత్సను విచారించిన సిబిఐ

ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రమణ్యం (గతంలో ఏపీఐఐపీ ఎండీ)ను గురువారం సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు పిలిపించారు. అప్పట్లో ఆయన ఇచ్చిన జీవోల గురించి ప్రశ్నించినట్లు తెలిసింది. సుమారు గంటన్నర పాటు ఎల్‌వీ సుబ్రహ్మణ్యం సీబీఐ అధికారులతో మాట్లాడారని, అవసరమైతే మరోసారి హాజరవ్వాలని వారు కోరారని తెలుస్తోంది. మంత్రి బొత్స, సుబ్రహ్మణ్యం చెప్పిన అంశాలు సరిపోయాయా లేదా అని చూసుకున్న అధికారులు ఈ కుంభకోణం వెనుక ఎవరి పాత్ర ఉందన్న విషయాన్ని దాదాపు పసిగట్టి కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications