హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో విశాలాంధ్ర సభకు నో పర్మిషన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Parakala Prabhakar
హైదరాబాద్: రాజధానిలో విశాలాంధ్ర మహాసభలకు పోలీసు శాఖ శుక్రవారం అనుమతి నిరాకరించింది. హైదరాబాదులో విశాలాంధ్ర సభలు నిర్వహిస్తే అల్లర్లు జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకు పోలీసు శాఖ అనుమతులు నిరాకరించారు. నగరంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో జరగనున్న వర్క్ షాప్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈ వర్క్ షాప్‌లో సమైక్య రాష్ట్రం వల్ల లాభాలను వారు వివరిస్తామని చెప్పారు. సమైక్యంగా ఉండటానికి గల కారణాలు, విడిపోతే నష్టాలు వివరిస్తామని చెప్పారు.

కాగా ఇటీవల ప్రజారాజ్యం పార్టీ మాజీ నేత పరకాల ప్రభాకర్ నేతృత్వంలో సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో రెండు సార్లు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. మొదటిసారి సమావేశం పెట్టినప్పుడు పలువురు తెలంగాణవాదులు సమావేశాన్ని అడ్డుకోగా విశాలాంధ్ర నేత ఒకరు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి రెండు రోజుల క్రితం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ జర్నలిస్టులు మరోసారి వారిని అడ్డుకున్నారు. పోలీసులు జర్నలిస్టులకు నచ్చజెప్పడంతో గతంలో తమపై అమానుష వ్యాఖ్యలు చేసిన మహాసభ నేత బయటకు వెళితేనే తాము ఉంటామని లేదంటే సమావేశాన్ని బహిష్కరిస్తామని చెప్పడంతో అతను బయటకు వెళ్లి పోయారు. దీంతో పరకాల సమావేశం కొనసాగిస్తూ 22, 23వ తేదీల్లో వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

కాగా పోలీసు శాఖ అనుమతి నిరాకరించడాన్ని విశాలాంధ్ర మహాసభ నేత చక్రవర్తి తప్పు పట్టారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాము కోరుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లి సభకు అనుమతులు తెచ్చుకుంటామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలను ఎవరైనా వెల్లడించ వచ్చునన్నారు.

English summary
Police department rejected permission to Vishalandhra Maha Saba for work shop about Samaikyandhra at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X