వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీ, రాధాకృష్ణకు సాక్షి రాసిస్తాం: శోభా నాగిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sobha Nagi Reddy
హైదరాబాద్: ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు, ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ, టివి9 రవి ప్రకాశ్‌లపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు శోభా నాగిరెడ్డి, గట్టు రామచంద్రా రావు శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. పచ్చళ్లు అమ్మి వ్యాపారాలు చేసిన రామోజీ రావు వేల కోట్లు ఎలా సంపాదించారో, మూతపడిన ఆంధ్రజ్యోతిలో చిరుద్యోగిగా చేరిన రాధాకృష్ణ వందల కోట్లకు ఎలా సొంతదారుడు అయ్యారో, సుప్రభాతం పత్రికలో మూడు వేల జీతానికి పని చేసే రవి ప్రకాశ్ ఇప్పుడు దేశ విదేశాల్లో వ్యాపారాలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వారి కంటే లాభసాటి వ్యాపారాలు చేసి జగన్ సంపాదిస్తే దోపిడీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. రామోజీ రావు ఫిల్మ్ సిటీలో బుల్లెట్ ప్రూఫ్ ఇంటిని నిర్మించుకున్నారని, రాధాకృష్ణ కూడా పెద్ద ఇంటిని నిర్మించుకున్నారని వారు ఇళ్లు నిర్మించుకుంటే లేనిది జగన్ కట్టుకుంటే తప్పా అని అడిగారు.

టివి 9లో ప్రసారం చేసినట్లు జగన్ ఇంట్లో ఒక్క ఖాళీ మద్యం బాటిల్ చూపించినా జగన్ ఇంటిని మీకు రాసిస్తాం లేదంటే ఛానల్ మూసేస్తారా అని సవాల్ విసిరారు. టివి 9 అసత్య కథనాలు ప్రసారం చేస్తూ జర్నలిజానికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తోందన్నారు. ఆధారాలు చూపించకుంటే ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాధాకృష్ణ, రామోజీ రావు, రవి ప్రకాశ్ వస్తే జగన్ ఇంటికి వెళదామని మీ రాతలు నిజమైతే అప్పటికప్పుడే జగన్ నివాసం, సాక్షి ఛానల్ వారి పేర రాస్తామన్నారు. ఏ వ్యక్తినో ముఖ్యమంత్రిని చేయడానికో, ఏ పార్టీనో అధికారంలోకి తీసుకు రావడానికో ఇటువంటి కథనాలు ప్రసారం చేస్తున్నారని విమర్శించారు. రామోజీ ఫిల్స్ సిటీ చుట్టూ రోడ్డు నిర్మించారని అది ఎవరి స్థలంలో నిర్మించారని ఆ విషయాలు రాసే దమ్ము ధైర్యే ఏ ఛానెల్, ఏ పత్రికకూ లేదన్నారు. తమకు పత్రికల పట్ల గౌరవం ఉందన్నారు. ఈ విధంగా విలువలు లేకుండా తప్పులు రాయడాన్నే ప్రశ్నిస్తున్నామన్నారు.

English summary
YSRC Party leader Sobha Nagi Reddy challenged that they will write Jagan's property on Ramoji Rao, Radha Krishna and Ravi Prakash if they prove on YS Jaganmohan Reddy properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X