హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చల్లారని పోలవరం: కెసిఆర్ నోరు విప్పాలన్న టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Devender Goud
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వీక్ నెస్‌ను కాంగ్రెసు పార్టీ సొమ్ము చేసుకొని ఉద్యమాన్ని చల్లబర్చే ప్రయత్నాలు చూస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు దేవేందర్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర రావు శుక్రవారం ఆరోపించారు. కెసిఆర్‌ను మేనేజ్ చేసి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కాంగ్రెసు తీవ్ర ప్రయత్నాలు చేస్తుందన్నారు. కెసిఆర్ పోలవరం టెండర్ల కోసం ఉద్యమాన్ని ఫణంగా పెడుతున్నారని విమర్శించారు. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ వాడుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల సెంటిమెంటుతో ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగులు జీతం తీసుకోకుండా ఉద్యమాలు చేస్తుంటే కెసిఆర్ మాత్రం ఉద్యమం పేరుతో వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.

కెసిఆర్‌ను ఉపయోగించుకొని ఉద్యమాన్ని నీరుగార్చుతుందనడానికి పోలవరం టెండరే మంచి ఉదాహరణ అన్నారు. కాంగ్రెసు ప్రజా ధనాన్ని ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటుందన్నారు. నమస్తే తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన వారే పోలవరం ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడంపై కెసిఆర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఆయన పత్రికలో పెట్టుబడులు పెట్టిన వారి పేర్లు వెల్లడించాలన్నారు. ష్యూ కంపెనీకి కాంట్రాక్టు దక్కేలా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చొరవ చూపారని విమర్శించారు. పోలవరం ఆరోపణలపై తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. ఆరోపణలు అవాస్తవమని తేలితే దేనికైనా సిద్ధమన్నారు. ఈ అంశంపై తెలంగాణ భవన్‌లోనైనా చర్చకు సిద్ధమన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు తెలంగాణ కోసం నవంబర్ 1న ఢిల్లీలో చేపట్టే దీక్షకు జెండాలు పక్కన పెట్టి తెలంగాణవాదులంతా మద్దతు పలకాలని కోరారు.

English summary
TDP senior leaders Devender Goud, Errabelli Dayakar Rao demanded TRS chief K Chandrasekhar Rao open his mouth on Polavaram - Namaste Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X