ఓఎంసిపై సబిత ఇంద్రారెడ్డిని ప్రశ్నించనున్న సిబిఐ

కాగా ఓబుళాపురం మైనింగ్ కేసు వ్యవహారంలో ఇప్పటికే అప్పటి గనుల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మిని సిబిఐ విచారించిన విషయం తెలిసిందే. ఆమె వాంగ్మూలం తీసుకోవటంతో పాటు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. నాటి గనుల శాఖ ఎండి రాజగోపాల్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ కేసులో కొద్ది రోజుల్లో ఛార్జీషీటు నమోదు చేయాల్సి ఉంది. దీంతో నాడు గనుల మంత్రిగా ఉన్న సబితను విచారించేందుకు సిబిఐ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బొత్సను విచారించిన మాదిరే ఆమె ఇంటికి ప్రత్యేక బృందం వెళ్లి విచారించే అవకాశముంది.












Click it and Unblock the Notifications