తండ్రి పేరుతో ఎంత సంపాదించావో చెప్పు: జగన్‌కు విహెచ్

సిబిఐ నిష్పక్షపాతంగా విచారణ జరుపుతుందని జగన్ అక్రమాలు బయటకు వస్తాయన్నారు. అధిష్టానం తనకు అవకాశమిస్తే ఊరూరా తిరిగి జగన్ అక్రమాలపై ప్రచారం చేస్తానన్నారు. జగన్ ఇన్నాళ్లుగా ఓదార్పు చేస్తున్నా మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఊరుకుండటం చూస్తుంటే వారి ఓపికకు అభినందనలు అన్నారు. జగన్ ఓదార్పు కేవలం రాజకీయ ప్రచారం కోసమేనన్నారు. ముఖ్యమంత్రి అవినీతిపరులను ఉపేక్షించ వద్దన్నారు. లోటస్ పాండులో జగన్ ఇంటికి అనుమతులిచ్చిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశానన్నారు. అవినీతిపరుల ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని ప్రధానికి లేఖ రాస్తానన్నారు.
అవినీతిపరులపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. నిత్యం పేదల కోసం తపించే జగన్ ఇంట్లో రూ.పద్దెనిమిది లక్షల రూపాయల కుర్చీ ఎందుకన్నారు. ముఖ్యమంత్రి అవినీతిపరులపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరహా చర్యలు తీసుకోవాలన్నారు. పోలవరం టెండర్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పాత్రపై ముఖ్యమంత్రి స్పందించాలన్నారు. టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓ మాట సరిగా చెప్పారని గతంలో వైయస్ చంద్రబాబుపై కేసు వేసి విత్ డ్రా చేసుకున్నారని ఆరోపించారు. అధిష్టానం అనుమతి లేకుండానే బాబుపై వేసిన కేసులను వైయస్ ఎందుకు ఉపసంహరించుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications