తెలంగాణ ఇప్పటికిప్పుడు పరిష్కారం కాదు: ఆజాద్

ఇరవై మూడు నెలలుగా తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర మూడు ప్రాంతాల నేతలతో చర్చలు జరిపామన్నారు. ఇక జాతీయస్థాయిలో చర్చ జరగాల్సి ఉందన్నారు. అవి కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కేంద్రం చేస్తున్న కృషిని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పరిస్థితులు క్రమంగా మెరుగు పడుతున్నాయన్నారు. ఇప్పటికే విద్యాసంస్థలు తెరుచుకున్నాయన్నారు. కాగా అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆజాద్‌తో గంట పాటు భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులు, సమ్మెపై చర్చించారు. దీపావళి వరకు రాష్ట్రంలో పరిస్థితులు సద్దుమణుగుతాయాని హామీ ఇచ్చారు. సమ్మె విరమించాలని కేంద్రం తరఫున కోరాలని చెప్పారు.












Click it and Unblock the Notifications