మేడమ్ సోనియా దయతోనే: చిరంజీవితో డిఎస్

కార్యకర్తలు ఓపిగ్గా ఉంటే అవకాశాలు వాటంతటవే వస్తాయని, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని చివరి వరకూ ఊహించలేకపోయాని డిఎస్ చిరంజీవితో అన్నట్లు సమాచారం. మేడమ్ సోనియా దయవల్లే తనకు ఎమ్మెల్సీ స్థానం దక్కిందని, కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేశానని డిఎస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఓపికతో వ్యవహరిస్తే అధిష్ఠానం తప్పకుండా క్రమశిక్షణ, విశ్వసనీయతను గుర్తిస్తుందని డీఎస్ వివరించారు.
ఈ సందర్భంగా డీఎస్‌ను చిరంజీవి సన్మానించారు. చిరంజీవితో పాటు కాంగ్రెస్ నేతలు సి.రామచంద్రయ్య, బూరగడ్డ వేదవ్యాస్, కోటగిరి విద్యాధరరావు, ఎమ్మెల్యేలు కె.కన్నబాబు, అవంతి శ్రీనివాస్, మహేశ్వర్‌రెడ్డి, అనిల్ తదితరులు డీఎస్‌ను అభినందించినవారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని కూడా డిఎస్ క్యాంపు కార్యాలయంలో కలిశారు. తన నామినేషన్ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కూడా ఆయన నివాసంలో డీఎస్ కలిసి ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications