రిజిస్టర్‌లో సంతకం చేసి డుమ్మా కొట్టిన శంకరరావు

అంతకుముందు శంకరరావు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వెంటనే పోలవరం టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనర్హులకు టెండర్లు కట్టబెట్టిన అధికారులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. అవినీతిని అపకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుకు కష్టమన్నారు. త్వరలో తెలంగాణ రావడం ఖాయమని రాష్ట్రం విడిపోయాక రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెసు అధికారంలోకి రావడం జరుగుతుందన్నారు.
కాగా మంత్రివర్గ సమావేశానికి నలుగురు మంత్రులు గైర్హాజరయ్యారు. ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అమెరికా పర్యటనలో ఉన్నందున ఆయన హాజరు కాలేదు. గల్లా అరుణ కుమారి ఆరోగ్య కారణాల రీత్యా, విశ్వరూప్ తమ సమీప బంధువు మృతి చెందడంతో, జానారెడ్డి ఢిల్లీలో ఉన్నందున గైర్హాజరయ్యారు.












Click it and Unblock the Notifications