సాక్షిలో గాలి పెట్టుబడులు: సిబిఐ ముందు జగన్

గాలి వ్యాపారాలతోనూ సంబంధం లేదని, గాలి పెట్టుబడుల కోసం తాను బలవంతం చేయలేదని, ఆయనకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేదని కూడా చెప్పారని సమాచారం. అందరిలాగే నా కంపెనీలోను పలువురు పెట్టుబడులు పెట్టారని అయితే వారి మూలాల సంగతి తనకు తెలియదని చెప్పారు. సిబిఐ అడిగిన చాలా ప్రశ్నలకు తెలియదని సమాధానం చెప్పారట. బాబు ఇచ్చిన లీజులనే వైయస్ కొనసాగించారని చెప్పారు.
కాగా సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ జగన్ స్టేట్‌మెంట్ రికార్డు చేశామని, వాస్తవాల కోసం మరింత లోతుగా విచారిస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును విచారణకు పిలుస్తారా అంటే జగన్ 2002 నాటి జివో నకల్‌ను తమకు అందించారని దానిని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎమ్మార్ కేసు వ్యవహారం ఈ రోజు మాత్రం ముగిసిందన్నారు. కాగా జగన్‌తో పాటు విజయ సాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి విచారణకు హజరయ్యారు.












Click it and Unblock the Notifications