సిబిఐ ముందుకు వైయస్ జగన్, కోఠిలో భారీ బందోబస్తు

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం పది గంటల ప్రాంతంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) అధికారుల ముందు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కోఠిలోని సిబిఐ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మీడియాకు కూడా అనుమతులు నిరాకరించారు. సిబిఐ కార్యాలయం పరిసర ప్రాంతాలలోని అన్ని దుకాణాలను పోలీసులు మూసి వేయిస్తున్నారు. వాహనాల రాకపోకలను నిషేధించారు. మరోవైపు జగన్‌ను ఆయన ఇంటి వద్ద జూపూడి ప్రభాకర్ తదితర నేతలు కలిశారు. జగన్ సిబిఐ ముందు కేవలం సాక్షిగానే హాజరవుతున్నట్టు ఆయన వర్గం నేతలు చెప్పిన విషయం తెలిసిందే.

జగన్‌ను ప్రశ్నించే సమయంలో ఏవైనా అవాంతరాలు ఏర్పడితే ట్రాఫిక్ డైవర్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. గురువారం సాయంత్రం ఎమ్మార్ కేసు విషయంలో కోనేరు ప్రసాద్‌ను సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈయనను సిసిఎస్ నుండి దిల్‌కుషా గెస్ట్ హౌస్‌కు శుక్రవారం ఉదయం తరలించారు. ఎమ్మార్ విల్లాల అమ్మకాల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు తాము గుర్తించామని, దానికి సంబంధించిన సాక్ష్యాలు సేకరించిన తర్వాతే కోనేరు ప్రసాద్‌ను అరెస్టు చేసినట్లు సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ గురువారమే చెప్పారు. కాగా బళ్లారిలోని సండూరు కార్యాలయంలో సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+