చంద్రబాబు ఆస్తుల వాస్తవ విలువ రూ.583 కోట్లు?

బాబు తన రాజకీయ జీవితంలో ఏమీ సంపాదించుకోలేరంటే ఎవరూ నమ్మరని 1979లో బాబు ఎమ్మెల్యే కాకముందు ఆయన తండ్రి పేర 20 గుంటలు, తల్లి పేరిట రెండున్నర ఏకరాలు మాత్రమే ఉందని, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఆస్తులు అంతకంతకు పెరిగాయని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తన కుటుంబ ఆస్తులు రూ.70 కోట్లు అని ప్రకటించిన బాబు ఇప్పుడు రూ.38 కోట్లేనని ప్రకటించారని, బాబు అసలు ఆస్తులు, బినామీ ఆస్తులు చూస్తే కళ్లు తిరిగి కింద పడటం ఖాయమని పేర్కొంది. బినామీల్ని పెంచి పోషించడం, వారికి రాజకీయ పదవులు కట్టబెట్టడం.. చివరకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్‌ను కూడా రాజకీయాలతో భ్రష్టు పట్టించారని ఇవన్నీ వైయస్ విజయమ్మ పిల్ ద్వారా వెలుగులోకి వచ్చాయన్నారు. తల్లి ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. బాబు హెరిటేజ్ మార్కెట్ విలువే తాజా లెక్కల ప్రకారం రూ.209 కోట్లని తెలిపింది.
ఎన్టీఆర్ ట్రస్టు కూడా బాబు ఆస్తియే అయినప్పటికీ ఆయన ఆస్తులు ప్రకటించినప్పుడు ఎప్పడూ దాని ఊసే ఉండదన్నారు. బాబు తనయుడు లోకేష్ ఇప్పటి వరకు ఏ ఉద్యోగం చేయకున్నా ఆయన పేర కోట్ల రూపాయల ఆస్తున్నాయని పేర్కొంది. లోకేష్ చదవుకు సత్యం రామలింగ రాజు అప్పట్లో సర్దుబాటు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయని కథనంలో పేర్కొంది. ఆయన చేస్తున్న ఉద్యోగం ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్‌లోనే అని, షేర్లు తదితరాలు అన్ని కలుపుకొని లోకేష్ ఒక్కడి ఆస్తియే రూ.300 కోట్లకు పైగా ఉంటుందని అందులో పేర్కొంది. తన పేరు మీద, తన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నట్లు బాబు ప్రకటించిన ఆస్తుల విలువే మార్కెట్ విలువ ప్రకారం రూ.583 కోట్లు ఉంటుందని అంచనా వేసింది.












Click it and Unblock the Notifications