కెసిఆర్ వ్యూహం తెలంగాణకు ప్రతిబంధకమా?

అంతేకాకుండా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీకి మరో రెండున్నరేళ్ల గడువు ఉంది. 2014 విషయం పక్కన పెడితే ప్రస్తుతానికి తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెసు పైన ఉంది. ఆ పార్టీ కూడా తెలంగాణకు శాశ్వత పరిష్కారం సూచించాలనే యోచనతో కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో టిఆర్ఎస్ ఇతర పార్టీ నేతలపై వల వేయడం సరికాదని పలువురు భావిస్తున్నారు. టిడిపి నేతలపై వల వేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండనప్పటికీ కాంగ్రెసు నేతల జంప్‌ల వల్ల జాతీయ కాంగ్రెసు పునరాలోచనలో పడే అవకాశముందనే పలువురు అభిప్రాయపడుతున్నారు. బిజెపి ఐనా, కాంగ్రెసు ఐనా మరే పార్టీ ఐనా తమ తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటాయి. కాంగ్రెసు పార్టీ కూడా టిఆర్ఎస్ తమ నేతలకు టిఆర్ఎస్ వల విసురుతుంటే ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
కాంగ్రెసు నేతలు టిఆర్ఎస్‌లోకి వెళ్లినా అది జాతీయ పార్టీ కాబట్టి దానికి పెద్దగా వచ్చే నష్టమేమీ ఉండదు. కానీ తెలంగాణపై తీసుకునే నిర్ణయాన్ని ఇప్పటి మాదిరిగానే జాప్యం చేసే అవకాశాలుంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు పోలవరం టెండర్లలో టిఆర్ఎస్ హస్తం ఉన్నదనే అంశం నుండి ప్రజల దృష్టి మరల్చడానికే కెసిఆర్ ఎమ్మెల్యేలను చేర్చుకునే కొత్త కుట్రకు తెరలేపారని టిడిపి ఆరోపిస్తోంది. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ వారినే నిలబెట్టి గెలిపించడం ద్వారా టిఆర్ఎస్‌కు బలం పెరగడం మినహా ఏమొస్తుందని ప్రశ్నించే వారూ ఉన్నారు. ఎమ్మెల్యేలను ట్రాప్ చేయడం ద్వారా కెసిఆర్ ఉద్యమాన్ని 2014 ఎన్నికల వరకు తీసుకు వెళ్లి అప్పుడు అత్యధిక ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లు గెలుచుకోవాలనే వ్యూహంతో ఉన్నారని కానీ తెలంగాణపై చిత్తశుద్ధితో లేరని ఆరోపిస్తున్నారు. అయితే తాము ఎవరిని తమ పార్టీలోకి రమ్మని బుజ్జగించడం గాని హెచ్చరించడం గాని చేయడం లేదని తెలంగాణపై కాంగ్రెసు, టిడిపిలకు చిత్తశుద్ధి లేకపోవడంతో వారే వస్తున్నాని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications