విచారణలో జగన్‌కు చుక్కలు చూపించిన సిబిఐ?

వీరందరినీ పక్కకు తప్పించి గాలికి లీజులు కట్టబెట్టేందుకు జగన్ సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించారు. అందరి విషయంలో విజయం సాధించినప్పటికీ... కొండారెడ్డి మాత్రం బాగా బెట్టు చేశారు. క్షేత్రస్థాయిలో మొత్తం ఆయనకే లీజు కేటాయిస్తూ ఆదేశాలు వెళ్లినప్పటికీ... సచివాలయం దాకా వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. గనుల లీజు 'గాలి' కంపెనీకి దక్కింది. దీంతో కొండారెడ్డి కోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత జగన్ స్వయంగా రంగంలోకి దిగి కొండారెడ్డితో మాట్లాడారు. బెంగళూరులోని తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడినా కొండారెడ్డి ససేమిరా అన్నారు. ఆ గనులు న్యాయంగా తనకే రావాలని, పక్కకు తప్పుకోలేనని స్పష్టం చేశారు. ఈలోపు ఓఎంసీకి గనుల కేటాయింపుపై కోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత కొండా రెడ్డిని జగన్ మరోమారు బెంగళూరుకు పిలిపించుకొని మాట్లాడారు. ఈ సారి విస్తరణలో మీ నాన్నకు పదవి ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత నీ ఇష్టమన్నారు. అయితే ఆ తర్వాత సన్నిహితులతో, శ్రేయోభిలాషులతో చర్చించి పెద్దవాళ్లతో పెట్టుకోవద్దనే ఉద్దేశ్యంతో విత్‌డ్రా చేసుకునేందుకు అంగీకరించారు. ఇదంతా జగన్ ప్రమేయంతోనే జరిగిందని అందులో పేర్కొంది.
ఈ వివరాన్నీ సేకరించిన సిబిఐ అధికారుల కొండారెడ్డిని ప్రశ్నించడంతో ఆయన పూసగుచ్చినట్లు చెప్పారు. శుక్రవారం కోఠిలోని సిబిఐ కార్యాలయానికి జగన్ చేరుకోవడానికంటే ముందే అధికారులు కొండారెడ్డిని అక్కడికి పిలిపించారు. ఆయనను ఓ గదిలో కూర్చోబెట్టారు. మరో గదిలో జగన్‌ను రకరకాల ప్రశ్నలు అడిగారు. కొండారెడ్డి చెప్పిన విషయాల ప్రస్తావన తీసుకొచ్చారు. జగన్ అదంతా ఒట్టిదేనని చెప్పి, గత ఎన్నికల్లో కొండారెడ్డి తండ్రి వరద రాజులు రెడ్డి ఓటమికి తామే కారణమని వారు భావిస్తున్నారని, అందుకే ఇలా చెప్పి ఉండొచ్చని అన్నారు. కొండారెడ్డితో తనకు సంబంధం లేదని, ఆయనను ఎప్పుడూ తన దగ్గరికి పిలిపించుకోలేదని చెప్పారు. అప్పుడు సిబిఐ అధికారులు కొండారెడ్డి చెప్పిందంతా అబద్ధమంటున్నారు కదా! ఆయన పక్క గదిలోనే ఉన్నారు. ఆయన ముందే ఇదంతా చెబుతారా? అని ప్రశ్నించారు. దీంతో జగన్‌కు దిమ్మతిరిగినంత పనైంది.
కొండారెడ్డిని కలవడానికి ససేమీరా అన్నారు. సిబిఐ అధికారులు పట్టు విడవకపోవడంతో జావగారిపోయి నన్ను దిగజార్చ వద్దు. ఇబ్బంది పెట్టొద్దు. నా వాంగ్మూలం నేను ఇస్తాను. కొండారెడ్డిని మాత్రం ఫేస్ చేయనని చెప్పారు. జగన్ కొండారెడ్డిని కలవనని చెప్పడంతో సిబిఐకి అసలు విషయం అర్థమైపోయింది. 'జగన్ మిమ్మల్ని ఫేస్ చేసేందుకు సిద్ధంగాలేరు. మీరు వెళ్లవచ్చు' అని కొండా రెడ్డిని అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత ఓఎంసీకి 64 ఎకరాల లీజు బదిలీ చేస్తూ చంద్రబాబు హయాంలో ఇచ్చిన జీవోను జగన్ సిబిఐకి ఇచ్చి ఆయనను కూడా ప్రశ్నించాలని కోరారు.












Click it and Unblock the Notifications