హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సాక్షి కాదు ముద్దాయి, విషయం దాచాడు: టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yerram Naidu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓబుళాపురం మైనింగ్ కేసులో సాక్షిగా కాకుండా ముద్దాయిగా చేర్చాలని తెలుగుదేశం పార్టీ సోమవారం కోరింది. ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎర్రన్నాయుడు జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిబిఐ విచారిస్తున్న సమయంలో కొండారెడ్డి అక్కడే ఉన్న విషయాన్ని జగన్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కొండారెడ్డి తెలియదని జగన్ చెప్పగలరా అని అన్నారు. జగన్ క్యాంపు నేతలు అసలు విషయం మరిచిపోయి తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వారికి ఎప్పుడూ బాబు నివాసమే కనిపిస్తోందన్నారు. జగన్ తన హయాంలో అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చి గాలి జనార్ధన్ రెడ్డికి లీజులు ఇప్పించారని ఆరోపించారు.

ఓఎంసి నుండి జగతి పబ్లికేషన్‌లోకి పెట్టుబడులు వచ్చాయన్నారు. ఆర్ ఆర్ గ్లోబల్ నుండి పెట్టుబడులు వచ్చినట్టు జగనే ఒప్పుకున్నారన్నారు. ఓఎంసి కేసులో జగన్‌ను ముద్దాయిగా చేర్చాలన్నారు. గాలికి లీజులు కట్టబెట్టేందుకు కొండారెడ్డిని బెదిరించారన్నారు. సిబిఐ దర్యాఫ్తుతో వైయస్ హయాంలోని ఒక్కో కుంభకోణం బయటపడుతోందన్నారు. రౌడీయుజం, బెదిరింపులతో లీజులు గాలికి వచ్చేలా చేశారన్నారు. సిబిఐ విచారణ అనంతరం జగన్ బాగా నటించారన్నారు. సిబిఐ విచారణ అనంతరం జగన్ నటన చూసి సినిమా డైరెక్టర్లు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.

English summary
Telugudesam Party senior leader Yerram Naidu appealed CBI that to add YSRC Party president YS Jaganmohan Reddy name as accused in OMC case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X