హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు వద్దకు తిరిగొస్తున్న తెలుగు తమ్ముళ్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు గతంలో దూరమైన తెలుగు తమ్ముళ్లు ఒక్కరొక్కరు మళ్లీ దగ్గరవుతున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన ఈ నవంబర్ 1వ తారీఖున ప్రముఖంగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అంతేకాదు పార్టీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్సు ఏర్పాటు చేశారు. గతంలో ఓసారి తలసాని పార్టీని వీడతారనే వాదనలు బలంగా వినిపించాయి. ఆ వార్తలు ఖండించినప్పటికీ ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న సందర్భాలు లేవు. మళ్లీ చాలా రోజుల తర్వాత ఆయన పార్టీ కార్యాలయం నుండి మాట్లాడారు. మాజీ మంత్రులు కరణం, కోడెల కూడా బాబుకు దగ్గరవుతున్నారు. కోడెల గతంలో పార్టీ వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చారట. కానీ ఆయన ఇటీవలి కాలంలో పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు.

కరణం పేరు కొంతకాలం పార్టీలో వినిపించలేదు. దీంతో ఆయన పార్టీకి క్రమంగా దూరమవుతున్నారన్నే భావన పలువురిలో కలిగింది. అయితే ఇటీవల చంద్రబాబు ఆయనకు తెలుగు రైతు పదవి ఆయనకు కట్టబెట్టడంతో ఆయనా దగ్గరైనట్టే. ఒకప్పుడు నెంబర్ 2గా ఉండి ఆ తర్వాత తెలంగాణ నినాదంతో బయటకు వెళ్లిన దేవేందర్ గౌడ్ కూడా ఎప్పుడో పార్టీలోకి తిరిగొచ్చారు. ఓ వైపు పార్టీలోకి యువరక్తం ఎక్కించే ప్రయత్నాలు, మరోవైపు పార్టీకి దూరమైన, దూరమవుతారనుకున్న సీనియర్ నేతలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటంతో టిడిపి కార్యకర్తల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది.

English summary
Telugudesam Party cadder is in happy with senior leaders returning. Former ministers Talasani Srinivas Yadav and Karanam are participating in party activities now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X