సాంబశివుడి హంతకుల హత్యకు సోదరుడి పథకం?

ఈశ్వర రెడ్డి, శివ, శేఖర్ రెడ్డి, అరుణ్ అనే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారు వాడిన నాలుగు సెల్‌ఫోన్లను, రెండు కత్తులను, రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాంబశివుడిని ఈ ఏడాది మార్చి 26వ తేదీ రాత్రి 12 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. నల్గొండ జిల్లా వలిగొండ మండలంలో ధూంధాం కార్యక్రమానికి వెళ్లి ఇన్నోవా వాహనంలో మరో పది మందితో కలిసి తిరిగొస్తున్న సాంబశివుడిపై గోకారం వద్ద రెండు కార్లలో వచ్చిన పదిమంది వేటకొడవళు, గొడ్డళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన మరణించారు. సాంబశివుడు నల్లగొండ జిల్లాకు చెందినవారే. సాంబశివుడు మావోయిస్టు పార్టీలో చాలా కాలం పనిచేశారు.












Click it and Unblock the Notifications