నేరెడ్‌మెట్‌లో మంత్రి శంకరరావుపై కేసు నమోదు

తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని గ్రీన్ ఫీల్డ్ ప్రతినిధులు కోర్టుకెక్కారు. గ్రీన్‌ఫీల్డ్ ప్రతినిధుల ఫిర్యాదుపై స్పందించిన కోర్టు శంకరరావుపై విచారణ జరిపించి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కాగా అక్రమాలు, అవినీతిపై ఇతర విషయంలో కోర్టుకెక్కే శంకరరావుకే కోర్టు షాక్ ఇవ్వడం విశేషం. శంకరరావు రాసిన లేఖ కారణంగానే వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపైన ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అలాగే మరో ఇద్దరు మంత్రుల అక్రమాలపై విచారణ జరపాలని శంకరరావు ఇటీవల కోర్టుకెక్కిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications