నేను జగన్ వెంటే: జయసుధ, తన వ్యాఖ్యలపై వివరణ

Jayasudha
హైదరాబాద్: తాము ఎప్పుడూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటామని సికింద్రాబాద్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు జయసుధ గురువారం అన్నారు. ఆమె రంగారెడ్డి జిల్లా కీసర మండలం చేర్యాల రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డితో పాటు పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతో ఆమె కాంగ్రెసు వైపు మరలుతుందో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే రచ్చబండ అనంతరం ఆమె మాట్లాడుతూ తాను జగన్ వెంటే ఉంటానని చెప్పడం విశేషం.

తన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి పనుల కోసం, నియోజవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నానని ఆమె చెప్పారు. దీనిని మరో రకంగా చూడవద్దని కోరారు. కాగా రెండు రోజుల క్రితం ప్రజలు అవినీతిపరులు అయిపోయారన్న తన వ్యాఖ్యలపై కూడా ఆమె వివరణ ఇచ్చారు. దీనిపై ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదన్నారు. సాధారణంగా ఉన్న విషయమే చెప్పానని డబ్బులు తీసుకున్న వారు బాధపడతారు, తీసుకోని వారికి బాధ అవసరం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+