శ్రీవారికి సమర్పించిన వజ్ర కిరీటంపై గాలి పేరు

తాము ప్రదానం చేసే బహుమతిపై తమ పేర్లను రాసుకుంటే దేవుడికి ఆగ్రహం కలుగుతుందని సాధారణంగా భక్తులు భయపడుతూ ఉంటారు. ఆలా పేరు చెక్కించకోకూడదని టిటిడి మాజీ అధికారి ఒకరు ఇచ్చిన సలహాను గాలి జనార్దన్ రెడ్డి తోసిపుచ్చారట. రెండేళ్ల క్రితం గాలి జనార్దన్ రెడ్డికి కష్టాలు ప్రారంభమయ్యాయి. దాంతో గత డిసెంబర్‌లో వైకుంఠ ఏకాదశి పర్వదినం ముగిసిన తర్వాత తన శ్రేయోభిలాషుల సూచన మేరకు వజ్ర కిరీటంపై తన పేరును చెరిపేయాలని జనార్దన్ రెడ్డి కోరారని అంటున్నారు. నిరుడు జూన్‌లో కూడా ఆయన మరోసారి టిటిడి అధికారులను కోరినట్లు తెలుస్తోంది. అలా చెరిపేయడం అసాధారణమైన చర్య అని, అంతేకాకుండా దానికి చాలా సమయం పడుతుందని సంబంధిత అధికారులు చెప్పినట్లు సమాచారం. ఈలోగా సెప్టెంబర్ 5వ తేదీ గాలి జనార్దన్ రెడ్డి అరెస్టయ్యారు.












Click it and Unblock the Notifications