జగన్‌పై ధ్వజమెత్తిన విహెచ్, భూములు తేలాలని వ్యాఖ్య

V Hanumanth Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు మరోసారి ధ్వజమెత్తారు. వైయస్ జగన్ రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. రైతుల నుంచి ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) పేర భూములు లాక్కున్నారని ఆయన ఆరోపించారు. సిబిఐకి సవాల్ విసురుతున్న జగతి పబ్లికేషన్స్ వైయస్ చైర్మన్ విజయసాయి రెడ్డి తాము భూములను బలవంతంగా తీసుకోలేదని ఎందుకు చెప్పలేకపోతున్నారని ఆయన అడిగారు. విజయసాయి రెడ్డి ప్రకటనపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

వైయస్ జగన్ జగతి సంస్థల్లోకి 300 కోట్ల రూపాయల పెట్టబడులు ఎలా వచ్చాయని ఆయన అడిగారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని ఆయన ఆరోపించారు. సెజ్‌ల పేర స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి రైతులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. సెజ్‌ల పేర స్వాధీనం చేసుకున్న భూముల్లో ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+