టిడిపి కార్యకర్తను చెప్పుతో కొట్టిన మరో ఎమ్మెల్యే

Telugudesam
విశాఖపట్నం: రచ్చబండ కార్యక్రమంలో ఓ వ్యక్తిని కొట్టిన సంగారెడ్డి శానససభ్యుడు జగ్గారెడ్డి ఉదంతం మరిచిపోక ముందే మరో శాసనసభ్యుడు అదే రీతిలో వ్యవహరించారు. అధికార కాంగ్రెసు పార్టీకి చెందిన మరో శాసనసభ్యుడు యువి రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబు రచ్చబండ కార్యక్రమంలో శుక్రవారం తెలుగుదేశం సర్పంచ కుమారడు కుమారుడిని చెప్పుతో కొట్టారు. గత రచ్చబండ కార్యక్రమంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ప్రశ్నించినందుకున కన్నబాబు టిడిపి సర్పంచ్ నాగిరెడ్డి సూర్యనారాయణ కుమారుడు అప్పలరాజును కొట్టాడు.

ఆ సంఘటన విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురం మండలం చీమలపల్లి గ్రామంలో జరిగింది. ఆందోళనకు దిగిన రాజును తాను తోసేశానని, కొట్టలేదని కన్నబాబు అన్నారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా కాంగ్రెసు కార్యకర్తలు మాత్రమే లబ్ధి పొందుతున్నారని, పేదలకు రేషన్ కార్డులు ఇవ్వడం లేదని రాజు రచ్చబండ కార్యక్రమంలో లేవనెత్తారు. దాంతో ఆగ్రహించిన కన్నబాబు వేదిక నుంచి దిగి వచ్చి రాజును తోసేశారు. చెప్పులోత కొట్టారు.

ఆ సంఘటనతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయితే, శాసనసభ్యుడు చెప్పుతో కొట్టినట్లు తాము చూడలేదని పోలీసులు అంటున్నారు. మెదక్ జిల్లా సదాశివపేటలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో శాసనసభ్యుడు జగ్గారెడ్డి ఓ కార్యకర్తను కొట్టినందుకు అరెస్టయి, బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నెల 5వ తేదీన ఆ సంఘటన చోటు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+