పరకాలపై టిఆర్ఎస్ దాడి: ఆంధ్రజ్యోతి వద్ద ఉద్రిక్తత

ఇరువురు ఇలాంటి చర్చా వేదికను రద్దు చేసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చర్చలు ఏర్పాటు చేస్తే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయని వారికి చెప్పారు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కూడా వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ వారు వికారాబాద్ బయలుదేరేందుకు ఎబిఎన్ కార్యాలయానికి వచ్చారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ తాను పరకాలకు ఒక్కరికే రక్షణ కల్పిస్తానని మిగతా వారికి కల్పించలేనని చెప్పారు. అయితే పరకాల తనతో మరో నలుగురైదుగురు వస్తారని వారికి కూడా రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయమై మాట్లాడుకుంటుండగా మాటా మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. అయితే కొందరు టిఆర్ఎస్ నేతలు పరకాలపై దాడి చేశారని తెలుస్తోంది. పరిస్థితి చేయిదాటుతుందని భావించిన పోలీసులు పరకాలను, చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ తరలించారు. పరకాలపై దాడిని సీమాంధ్ర నేతలు, ఆంధ్రా మేథావుల సంఘం ఖండించింది.












Click it and Unblock the Notifications