అప్పుడే చెప్పలేం, చర్చల తర్వాతే: తెలంగాణపై ఆజాద్

కాంగ్రెసు కోర్ కమిటీ సోమవారం ఉదయం సమావేశమైంది. ఈ సమావేశానికి ఆజాద్ కూడా హాజరయ్యారు. తెలంగాణపై, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలపై, తాజా రాజకీయ పరిణామాలపై కోర్ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. అయితే, తెలంగాణపై చర్చలు ఓ కొలిక్కి రాలేదని తెలుస్తోంది. కోర్ కమిటీ సమావేశానంతరం గులాం నబీ ఆజాద్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణ నాయకులు రెండో ఎస్సార్పీని వ్యతిరేకిస్తున్న స్థితిలో ఏం చేయాలనే విషయంపై ఆజాద్ సోనియాతో మాట్లాడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications