బాబుపై సిబిఐ విచారణలో నిజాలు తేలాలి: విహెచ్

V Hanumantha Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఆస్తులపై వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. అందుకు చంద్రబాబు తన ఆస్తులపై సిబిఐ విచారణను స్వాగతించాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సిబిఐ విచారణలో వాస్తవాలు బయటపడినప్పుడు చంద్రబాబు విశ్వసనీయత పెరుగుతుందని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కోర్టు ఆదేశాలతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన ఆశించారు. ప్రస్తుతం పిటిషన్ వేసిన వైయస్ విజయమ్మ భర్త వైయస్ రాజశేఖ రెడ్డి గతంలో చంద్రబాబుపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉపసంహరించుకున్నారని ఆయన గుర్తు చేశారు.

చంద్రబాబు ఆస్తుల విషయంలో చట్టం తన పని తాను చేసుకుని పోతుందని ప్రభుత్వ విప్ కొండ్రు మురళి అన్నారు. ఆస్తులపై విచారణ జరపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై, చంద్రబాబుపై మాదిరిగానే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కూడా ఆరోపణలు వస్తున్నాయని, కెసిఆర్ కూడా తన నిజాయితీని నిరూపించుకుంటే బాగుంటుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+