భువనేశ్వరి, లోకేష్, రామోజీలపైనా సిబిఐ విచారణ

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు, సినీ నటుడు మురళీమోహన్, పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు, మరో పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి, వి. నాగరాజు నాయుడు, కర్నాటి వెంకటేశ్వర రావు, సిఎం రమేష్, అహోబలరావులపై విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. రామోజీ రావుకు చెందిన ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్, భువనేశ్వరికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌పైనే కాకుండా మధుకాన్ షుగర్స్ అండ్ పవర్ ఇండస్ట్రీస్‌పై విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది.
కాగా, తమకు ఎనిమిది సెట్ల పిటిషన్ ప్రతులను అందించాలని హైకోర్టు పిటిషనర్ వైయస్ విజయమ్మను హైకోర్టు ఆదేశించింది. వాటిని వారంలోగా తమకు అందించాలని ఆదేశించింది. చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలని హైకోర్టు సిబిఐని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెబీని ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, విచారణలో ఏయే విషయాలు బయటపడుతాయో చూద్దామని వైయస్ విజయమ్మ హైకోర్టు ఆదేశాలపై ప్రతిస్పందిస్తూ అన్నారు.












Click it and Unblock the Notifications