సిబిఐ విచారణకు భయపడేది లేదు: చంద్రబాబు

తాను ఇప్పటికే తన అస్తులనే కాకుండా తన కుటుంబ సభ్యులను ఆస్తులను కూడా ప్రకటించానని, తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని గతంలోనే నిరూపితమైందని ఆయన అన్నారు. తాను ఏ విధమైన తప్పూ చేయలేదని, విచారణకు భయపడేది లేదని ఆయన అన్నారు. సిబిఐ విచారణలో తాను నిర్దోషిగా బయటపడుతానని ఆయన దీమా వ్యక్తం చేశారు. తనకు నోటీసు ఇవ్వకుండా తన ఆస్తుల వ్యవహారంపై ప్రాథమిక విచారణకు ఆదేశించడం సరి కాదని ఆయన అన్నారు. ఈ విషయంపై న్యాయవాదులతో చర్చిస్తానని, ఆ తర్వాత ఏ విషయమూ మాట్లాడుతానని ఆయన అన్నారు. సింగపూర్‌లో తనకు హోటల్ ఉందనే ఆరోపణలో నిజం లేదని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆస్తులపై హైకోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ హైకోర్టు సోమవారం ఆ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు ఆస్తులపై ప్రాథమిక విచారణ జరిపి మూడు నెలల్లోగా సీల్డ్ కవర్‌లో తమకు నివేదిక అందిచాలని హైకోర్టు సిబిఐని ఆదేశించింది.












Click it and Unblock the Notifications