చంద్రబాబుపై జగన్ వర్గం రోజా, అంబటి ఎదురు దాడి

హైకోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశించడంతో ఆయన ఆస్తుల ప్రకటనలోని నిజమెంతో కనిపిస్తోందని జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. బాబు బినామీ ఆస్తులపై దర్యాఫ్తు చేయాల్సి ఉందన్నారు. తాను నిజాయితీపరుడినంటూ అల్లిబిల్లిగా ఆస్తుల విలువ ప్రకటించి అన్నాహజారే దీక్షకు మద్దతుగా నిరాహార దీక్షలు చేసినంత మాత్రాన ప్రజలు ఆయన మాటలు విశ్వసించలేరన్నారు. త్వరలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని జూపూడి అభిప్రాయపడ్డారు. వచ్చే సమావేశాలో అసెంబ్లీకి చివరి సమావేశాలు అన్నారు.
బాబు తొమ్మిదేళ్ల పానలో అక్రమాలు విచారణ ద్వారా బయటకొస్తాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వారం రోజులుగా ఎల్లో మీడియా జగన్ పైన, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన విషపూరిత ప్రచారం చేస్తోందని విమర్శించారు. బాబు నీతివంతుడని దేశంలో ఎవరూ అనుకోవడం లేదన్నారు.












Click it and Unblock the Notifications