హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ తలకు గన్ గురిపెట్టి బెదిరించాడు: సతీష్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: మైనింగ్‌ను వదులుకోవాలంటూ తనను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తన తలకు గున్ గురిపెట్టి బెదిరించాడని వైఎం మహాబలేశ్వరప్ప అండ్ సన్స్ మైనింగ్ కంపెనీకి చెందిన వై సతీష్ ఆరోపించారు. తనను జగన్ బెదిరించిన విషయాన్ని సతీష్ సిబిఐ అధికారులకు వివరించినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది. ఆర్ఆర్ గ్లోబల్‌తో సబ్ లీజుకు అంగీకారం కుదుర్చుకోవాలని జగన్ బెదిరించినట్లు ఆయన తెలిపారు. సిబిఐ ఎదుట సతీష్ నాలుగు సార్లు తన వాదన వినిపించినట్లు ఆ ఆంగ్ల పత్రిక రాసింది. ఆ ఆంగ్ల పత్రిక రాసిన వార్తాకథనం ప్రకారం - తన గనులు గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళావురం మైనింగ్ కంపెనీ, బళ్లారి ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ గనులను ఆనుకుని ఉన్నాయని, దాంతో గాలి కోసం జగన్ తనను బెదిరించాడని ఆయన చెప్పారు.

మహాబళేశ్వరప్ప అండ్ సన్స్ 1978లో లీజు పొంది, గనుల తవ్వకాన్ని 2009 వరకు సాగించింది. జగన్ తనను బెంగళూర్ పిలిపించి, గనులను ఇచ్చేయాలని చెప్పారని సతీష్ చెప్పారు. సజ్జల దివాకర్ రెడ్డికి చెందిన ఆర్ఆర్ గ్లోబల్‌తో సబ్ లీజు కుదుర్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని తనను జగన్ రివాల్వర్‌తో బెదిరించాడంటూ సతీష్ రాతపూర్వకంగా సిబిఐకి తెలిపారు. దాని తర్వాత హైపర్ టెన్ష‌న్‌కు, కార్డియాక్ సమస్యలతో సతీష్ ఆరు నెలల పాటు ఆస్పత్రిలో ఉన్నారు. ఆర్ఆర్ గ్లోబల్, మహాబలేశ్వరప్ప అండ్ సన్స్ మధ్య జరిగిన ఒప్పందంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని సిబిఐ గుర్తించినట్లు ఆంగ్ల పత్రిక రాసింది. ఆర్ఆర్ గ్లోబల్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లో 49 కోట్ల రూపాయలు, ఇందిరా టెలివిజన్‌లో 30 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టింది.

English summary
According to an English News paper reporter _ Kadapa MP Y.S. Jagan Mohan Reddy had allegedly threatened the lessee of Y.M. Mahabaleshwarappa and Sons Mining Company, Y. Satish, with dire consequences if he did not give up mining.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X